ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు నిరాశ ఎదురైంది.. అక్రమ మైనింగ్ కేసులో తనపై పీటీ వారెంట్ దాఖలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది.. అయితే, దిగువ కోర్టు పీటీ వారెంట్ అనుమతించినా వచ్చే గురువారం వరకు వారెంట్ అమలు చేయబోమని కోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .