NTV Telugu Site icon

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన.. హైకోర్టు కీలక ఆదేశం

Tirupati Stampede

Tirupati Stampede

తిరుపతి తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సంఘటనపై ఇప్పటికే ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. కాగా.. కర్నూల్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి వేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై ఈరోజు మరో పిల్ కూడా దాఖలైంది. ఇప్పటికే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతో వేరే విచారణ అవసరం లేదని హైకోర్ట్ వెల్లడించింది. దీంతో.. హైకోర్టు రెండు పిల్స్‌ను కొట్టివేసింది.

PM Modi: ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న మోడీ టూర్.. మార్సెయిల్‌లో భారతీయ సైనికులకు ప్రధాని నివాళి

తిరుపతి పద్మావతి పార్క్ దగ్గర ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు.. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు ఇచ్చే విషయంలో తొక్కిసలాట జరిగింది.. సీఎం చంద్రబాబు ఈ సంఘటనలో సీరియస్ అయ్యారు.. కొంతమంది అధికారుల బదిలీ కూడా జరిగింది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. విచారణకు ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Vishwak Sen: మిడిల్ ఫింగర్ వివాదంలో విశ్వక్.. నేను ప్రతిసారి తగ్గను?