CM Chandrababu: తప్పు చేసినవారు తప్పించుకోలేరు.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో చర్చల సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగటం సబబు కాదని అభిప్రాయపడ్డారు పలువురు మంత్రులు.. ఏ తప్పూ చేయకుండానే తెలుగుదేశం నాయకుల్ని జైలుకు పంపారని మంత్రి సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేయగా.. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.. వైసీపీ ప్రభుత్వంలో మనల్ని అన్యాయంగా వేధించారని మనమూ వేధించటం సరికాదని హితవు చెప్పారు.. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోంది.. నేరం రుజువయ్యాక ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.. తప్పు చేసిన వారిని శిక్షించటమే మన విధానం, రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదు.. ఈ తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు సీఎం చంద్రబాబు..
Read Also: DK Shivakumar: చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట.. స్పందించిన డిప్యూటీ సీఎం..!
ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో పలు విషయాలు చర్చంచారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయి.. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్థులను కలవాలంటే భయపడేవారు.. ఇప్పుడు నేరస్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.. నేరస్థులకు కొమ్ము కాస్తూ రాజకీయాలను ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా బాగుంది.. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలి.. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలి.. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలి అని సీఎం చంద్రబాబు సూచించారు..