Site icon NTV Telugu

MLA Quota MLC Election: ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు.. రేపు క్లారిటీ..!

Tdp

Tdp

MLA Quota MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ఐదు స్థానాలకు గాను…ఒకటి కన్ఫామ్‌ అయిపోయింది. జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా ? వద్దా ? అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ ఎమ్మెల్సీ వద్దంటే…అది కూడా టీడీపీనే తీసుకునే అవకాశం ఉంది. ఉన్న ఎమ్మెల్సీలను ఎవరికి ఇవ్వాలన్న దానిపై తెలుగుదేశం పార్టీలో తర్జనభర్జన సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను…ఆశావహులు కలిశారు. ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారంతా…మరోసారి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీలు విషయంలో రేపు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టిడిపి ఇద్దరు బీసీలు…ఒక ఎస్సీ…ఒక ఎస్టీకి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో టిక్కెట్ రానివాళ్లు…టిడిపి పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై మాత్రమే దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇద్దరు బీసీలకు ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎల్లుండి అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: Nagababu Nomination: నామినేషన్‌ వేసేందుకు సిద్ధమైన నాగబాబు.. ముహూర్తం ఎప్పుడంటే..?

సామాజిక సమీకరణాలు.. జిల్లాల వారీగా ఆయన నేతల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ ఎంపికపై దృష్టిపెట్టారు సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మాజీ మంత్రులు కేఎస్‌ జవహర్…కిడారి శ్రవణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మైనారిటీల నుంచి కూడా కొంతమంది ఆశావహులు ఉన్నారు. వీరు చంద్రబాబును కలిసి తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. రాజధాని కోసం ఉద్యమంలో పాల్గొని.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో దీక్ష చేసిన షేక్ రిజ్వానా…ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి నజీర్..విజయవాడలో ఎమ్ ఎస్ బేగ్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈ సారి మైనారిటీలకు ఎంత వరకు అవకాశం వస్తుందో చూడాలి. నాలుగు సీట్లు టీడీపీకి వస్తే…చివరి నిమిషంలో మైనారిటీలకు ఇవ్వొచ్చన్న యోచనలో ఉంది టీడీపీ. సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version