NTV Telugu Site icon

Supreme Court: వైఎస్‌ వివేకా కేసు.. వారికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court

Supreme Court

Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన కూతరు సునీతరెడ్డి.. ఈ కేసులో వైఎస్‌ భాస్కర్ రెడ్డికి హైకోర్టు జారీ చేసిన బెయిలు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. అంతేకాకుండా వైఎస్‌ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మరో పిటిషన్ వేసింది సీబీఐ.. ఇక, సునీత రెడ్డి, సీబీఐ పిటిషనల్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. మరోవైపు తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు..

Read Also: Good Sleep Tips : హాయిగా నిద్ర పట్టాలంటే ఈ టిప్స్ పాటించండి..

అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్‌ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే కాగా.. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మొదట సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ.. ఇక, ఆ తర్వాత వైఎస్‌ వివేకా కుమార్తె సునీత రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సీబీఐ దాఖలు చేసిన వైఎస్‌ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌తో సునీత పిటిషన్‌ను జత చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.. ఇక, కేసులో ప్రతివాదులుగా ఉన్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు..