మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. మంచం ఎక్కి చాలాసేపైనా సరే.. నిద్ర రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.

  అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు.

 రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల నిద్ర పట్టే అవకాశాలు ఉంటాయట. 

పడుకునే ముందు టీవీ చూడటం, సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటి గ్యాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలి. 

వీలైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, గోరువెచ్చటి పాలు తాగడం.. వంటి అలవాట్ల వల్ల కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి.   

ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా రాత్రి పూట నిద్ర పట్టకుండా చేస్తాయి. ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం మంచిది.

 వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.

 పడుకోవడానికి కనీసం గంట ముందు తల, కాళ్లను సున్నితంగా మసాజ్ చేసుకోవాలట. నరాలు ఉత్తేజితమై హాయిగా నిద్ర పడుతుందట.