AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. అయితే, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఆ తర్వాత తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.. కాగా, అక్రమ మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. దీంతో, విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన వాదనలు వినిపించారు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్ర, సిద్ధార్థ అగర్వాల్.. వాదనల తర్వాత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూనే ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: IND vs WI: స్లో అండ్ స్టడీగా టీమిండియా బ్యాటింగ్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే?
కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి.. ఏ-39గా ఉన్నారు.. అయితే, హైకోర్టులో మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు.. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా.. తుడా చైర్మన్ హోదాలో మోహిత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. మద్యం ముడుపుల సొమ్మును తరలించేందుకు అధికారిక వాహనాలు వినియోగించారని హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. పిటిషనర్‌కు నేరచరిత్ర ఉందని.. ఏ-38గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబసభ్యులు అనేక కంపెనీల్లో భాగస్వాములు అయ్యారని.. పేర్కొన్న విషయం విదితమే కాగా.. మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు.. దీంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహిత్‌రెడ్డికి ఊరట దక్కింది..
