MP Mithun Reddy: సుప్రీంకోర్టులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ
- ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ..
- విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు..
- తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ..
- సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సంచలనంగా మారిన లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ మిథున్ రెడ్డి.. మరోవైపు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ.. దీంతో, సీఐడీ దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించి రీజైండర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది.. ఇక, లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ .. మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయని పేర్కొన్నారు అభిషేక్ సింఘ్వీ.. అయితే, ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు..
Read Also: Mohanlal : ఆయనతో మాట్లాడకపోతే నాకు రోజు గడవదు..
Also Read
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
కాగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం విదితమే.. మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని 8 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు.. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసి, సంతకాలు తీసుకున్నారు.. విచారణలో సిట్ కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం.. అయితే, ఇదంతా ఓ కట్టుకథ, గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని సిట్ విచారణ తర్వాత పేర్కొన్నారు మిథున్ రెడ్డి.. గనుల్లో అవకతవకలు జరిగాయన్నారు, ఏ ఒక్క ఆరోపణ కూడా ఇప్పటి వరకు ప్రూవ్ కాలేదన్నారు. తమ సొంత భూమిని అటవీభూమి అంటూ ఆరోపణలు చేశారని ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్ అయిన విషయం విదితమే.. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో ఒక భాగమేనన్నారు. ఇక, బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో ఇంకేమీ మాట్లాడలేనని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!