మోహన్‌లాల్.. ప్రజంట్ 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇప్పటి కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూడు నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రీసెంట్‌గా ‘తుడరుమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా. ఎం రంజిత్ నిర్మాతగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కేరళ నేటివిటి, విజువల్ బ్యూటీతో హ్యుమన్ ఎమోషన్స్, క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న మోహన్‌లాల్ తనకు సంబంధించిన చాలా విషయాలు పంచుకున్నాడు..
Also Read: Meenakshi Chaudhary : దాని కారణంగా అందరు నాకు దూరంగా ఉండేవారు..
‘ నాకు చిన్నతనం నుండి ఆర్మీ అంటే ఎంతో ఇష్టం. అందునే నేను చేసిన సినిమాలతో యువతకు స్పూర్తినిచ్చిందుకు దేశ ప్రభుత్వం నాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చింది. ఆ హోదా దక్కినందుకు ఎంతో గర్వంగా ఉంది. దాని వల్లే విపత్తులు వచ్చినప్పుడు సైన్యంతో కలిసి సహాయక చర్చల్లో పాల్గొనగలుగుతున్నాను. నా నలభై ఎనిమిదేళ్ల సినిమా కెరీర్ నాకు జీవితం అంటే ఏంటో నేర్పించింది. ఇక్కడ అందరి జీవితాలు బయటకు కనిపించినంత అందంగా మాత్రం ఉండవు. ఎంతో శ్రమిస్తే కానీ ఈ స్థాయికి చేరుకోలేదు. ఇక మమ్ముట్టి నా ప్రాణ స్నేహితుడు ఇప్పటికే తనతో కలిసి దాదాపు 50 సినిమాలు చేశాను, ఇద్దరం కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనేది నా కోరిక. రోజులో ఒక్కసారైనా మమ్ముట్టితో మాట్లాడందే నాకు ఏమీ తోచదు. అయ్యప్పస్వామి భక్తుడైన నేను అప్పుడప్పుడు మాల వేసుకుని, కాలినడకన వెళ్లి ఇరుముడి సమర్పించి వస్తుంటా, ఆత్మీయుల కోసం కూడా పూజలు చేస్తుంటా, పూజల వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది’ అని ఆయన అన్నారు.