NTV Telugu Site icon

YCP-TDP Rebel MLA’s: రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో ఛాన్స్..

Rebal Mlas

Rebal Mlas

వైసీపీ-టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరో ఛాన్స్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొ్న్నారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి అని నోటీసులో స్పష్టం చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, పిటిషనర్ ప్రసాద్ రాజులకు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఒకేసారి ఐదుగురుని విచారణ చేయనున్నారు స్పీకర్. కాగా.. మరోసారి ఎమ్మెల్యేల వివరణ తీసుకోనున్నారు. ఆ తరవాత ఎమ్మెల్యేల అనర్హత పై తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు స్పీకర్ తమినేని.

Jaswant Singh: కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్‌ ఇంట్లో విషాదం

కాగా.. సోమవారం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు(ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి), టీడీపీ రెబల్ ఎమ్మె్ల్యే (వాసుపల్లి గణేష్)ఒకరు స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. తమ వాదనను వినిపించడానికి నాలుగు వారాల సమయం కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోరారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ జారీచేసిన నోటీసులపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మండలి ఛైర్మన్ నోటీసును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య వేసిన పిటిషన్ పైనా.. విచారణ సాగింది.. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

CM Revanth Reddy : అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశాం