Tirumala Laddu Controversy: తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు.. ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానని అన్నారు. తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయమైందని మండిపడ్డారు.. స్వచ్ఛమైన నెయ్యి కేజీ 319 రూపాయలకు లభిస్తుందా..? అది నెయ్యా అని ప్రశ్నించారు వీర్రాజు.. బీజేపీ డిమాండ్ కు వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. అన్నవరంలో కిలో నెయ్యి 520 రూపాయలకు తీసుకుంటుంటే.. తిరుపతిలో నెయ్యి 319 రూపాయలు తీసుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు.. అన్నవరం ప్రసాదం నెయ్యి మంచిదా…? తిరుమల లడ్డూ నెయ్యి చెడ్డదా ? అని ప్రశ్నించారు.
Read Also: Jagtial Residential in Iraq: సార్ మమ్మల్ని కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల వాసుల కష్టాలు..
ఇక, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో అవకతకులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు సోము వీర్రాజు.. ప్రసాదాలు తయారీ కోసం కొనే పదార్థాలు కొన్ని విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించాలని కోరారు. టీటీడీ బడ్జెట్ 6000 కోట్ల రూపాయలు అయితే లడ్డూ ప్రసాదానికి 600 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. లడ్డూ ప్రసాదానికి కేవలం 10 శాతం మాత్రమే ఖర్చు చేయడం దారుణమని దుయ్యబట్టారు.. అన్నవరంలో నెయ్యి 520 రూపాయలకు ఎందుకొంటున్నారని ప్రశ్నించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయాల్లో న్యాయమేని ప్రసాదాన్ని అందించే విధంగా ఆలోచన చేయాలని.. ఇందుకోసం బీజేపీ ఆలోచన చేస్తుందని అన్నారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే వాటికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు..