Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రైతులను కూడా మోసం చేశారు.. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇచ్చారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఎంతమందికి లబ్ధి చేకూరిందో ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని మండిపడ్డారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రైతులు అత్యంత కీలకమని సజ్జల పేర్కొన్నారు. పార్టీ పేరులోనే ‘రైతు’ అనే పదం ఉందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రైతు విభాగాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని, రైతాంగ సమస్యలపై ఎప్పుడైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ప్రస్తుతం రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని సజ్జల విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుపోయిందని, దళారులు మరియు అధికార పార్టీ నేతలు కలిసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో రైతాంగ సమస్య ఏది వచ్చినా పరిష్కరించామని సజ్జల తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతుభరోసా నిధులు అందించామని చెప్పారు. రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గుర్తు చేశారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్‌లో పర్యటిస్తున్నారని సజ్జల విమర్శించారు. రైతాంగ సమస్యలను పక్కనపెట్టి ఇతర అంశాలపై మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై గట్టిగా పోరాడాలని సజ్జల పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..