Site icon NTV Telugu

RK Roja: మళ్లీ పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసిన రోజా..! తొక్కిపెట్టి వారి నార తీయాలి కదా..?

Roja Rk

Roja Rk

RK Roja: కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆర్కే రోజా.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్రగా అభివర్ణించిన ఆమె.. సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.. ఇక, వైసీపీ ఓటమిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా.. అసలు వైఎస్‌ జగన్ ను ప్రజలు ఓడించలేదు.. ఈవీఎంల గోల్ మాల్ తో ఓడించారని ఆరోపించారు.. అయితే, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుందన్నారు..

Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని చంపిన యువకుడు

ఇక, మహిళల అక్రమ రవాణాపై ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు ఆర్కే రోజా.. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్… మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా..? అని ప్రశ్నించారు.. మరోవైపు, కూటమి నేతలు వీకెండ్స్ లో హైదరాబాద్, బెంగుళూరు తిరగటమే సరిపోతుందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

Exit mobile version