Site icon NTV Telugu

Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ. 9151 కోట్లు

Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని సూచించిన ఆయన.. భూకేటాయింపులు పూర్తవగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ అమరావతికి అనుసంధానం చేసే రూ. 2047 కోట్లు విలువైన 56 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ “డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్” ను నీతి ఆయోగ్ ఆమోదించిందన్న ఆయన.. విజయవాడ-ఏరుపాలెం-అమరావతి గుండా నంబూరుకు రైల్వే లైన్ నిర్మాణం జరగనుందన్నారు..

Read Also: Drugs Positive: ఇదేందయ్యా ఇది.. సొరచేపలకు ‘డ్రగ్స్ పాజిటివ్’

ఇక, ఈ ఏడాది ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం రూ. 9151 కోట్లు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు అశ్వినీ వైష్ణవ్.. ఏపీలో మొత్తం రూ. 73,743 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.. ఇప్పటి వరకు మొత్తం 743 ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్ వంతెనల నిర్మాణం జరిగాయి.. ఏపీలో 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందని స్పష్టం చేశారు.. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 73 “అమృత్” రైల్వే స్టేషన్లు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.

Exit mobile version