NTV Telugu Site icon

Perni Nani: ఎన్టీఆర్‌లా అభిమన్యుడు కాదు.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారు..!

Perni Nani

Perni Nani

Perni Nani: సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. వైఎస్‌ జగన్‌ రాప్తాడు నియోజకవర్గం పర్యటనపై విమర్శలు, ఆరోపణలు కొనసాగుతోన్న వేళ.. జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు.. అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు.. కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు.. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు.. జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్.. అలర్జీ అన్నారు.. అప్పటి దాకా నా ఆరోగ్యం సూపర్ అన్న చంద్రబాబు.. ఆ తర్వాత డ్రామాలు ఆడారు.. మీరు ఆడేవాటిని డ్రామాలు అంటారు.. దోమలు పంపి జైల్లో కుట్టిచ్చి చంపిస్తారని మాట్లాడారు.. రాజకీయాల్లో డ్రామాలు ఆడాలన్నా.. నాటకాలు ఆడాలన్నా చంద్రబాబుకే సాధ్యం అంటూ ధ్వజమెత్తారు..

Read Also: Tariffs War: ట్రంప్ ఎఫెక్ట్.. ఇండియా తర్వాత, ఈయూ సాయం కోరిన చైనా..

హెలికాప్టర్‌ విండ్ షీల్డ్ బద్దలు అయితే పైలెట్ ఎలా వెళ్లాడని ఓ తెలివైన మంత్రి అడుగుతారు.. పైలెట్ ఏదో ఒక రకంగా వాహనాన్ని తీసుకువెళ్తారని తెలియదా..? అని ప్రశ్నించారు పేర్ని నాని.. హెలికాప్టర్‌లు ఎవరి కంట్రోల్‌లో ఉంటాయి..? ఆ శాఖకు మంత్రి మీ టీడీపీ వ్యక్తే కదా..? అని నిలదీశారు.. హెలికాప్టర్‌ మరోచోటకు వెళ్లిందని అంటారు.. జనాల్ని డబ్బులు ఇచ్చి హెలికాప్టర్‌ మీద పడాలి అని తెచ్చుకున్నారు అని చెబుతారు.. సంస్కారం మర్చిపోయి మాట్లాడతారని ఫైర్‌ అయ్యారు.. అయితే, వైఎస్‌ జగన్ సినిమా యాక్టర్‌ల కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న నాయకుడు.. అధికారం మీ దగ్గర ఉన్నా.. జనం జగన్ దగ్గర ఉన్నారని మీ ఏడుపు.. దిక్కుమాలిన ఏడుపులు ఏడుస్తున్నారు అని సెటైర్లు వేశారు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి 40 శాతం ప్రజల మద్దతు ఉన్న నేత జగన్.. జెడ్ ప్లస్ రక్షణలో ఉన్న జగన్ బయటకు వస్తున్నారంటే తగిన భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.. హెలికాప్టర్‌ రెక్కలు తిరిగే సమయంలో ప్రజలు అక్కడకు వెళ్లారంటే వైఫల్యం ఎవరిది..?జగన్ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. గతంలో హెలికాప్టర్‌ దగ్గరకు జనాలు వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు.. అప్పుడు జగన్ సీఎంగా లేకపోయిన ఎన్నికల కమిషన్ భద్రత కల్పించింది.. ప్రస్తుతం రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయి అని మండిపడ్డారు..

Read Also: Moto Pad 60 Pro: 12.7-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 3K రిజల్యూషన్తో వచ్చేస్తున్న మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్

ఇక, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడారని కేసు నమోదు చేశారు.. హెలికాప్టర్‌ విండ్ షీల్డ్ బద్దలు కొట్టించారని కేసు నమోదు చేశారు.. పోలీసులు వారించినా వినిపించుకోలేదు అని కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు నాని.. తులసివనంలో గంజాయి మొక్కలా కొందరు పోలీసులు ఉన్నారు.. ఖాకీ బట్టల మాటున దిగజారుతున్నారు.. దిగజారిన పోలీసుల గురించే జగన్ మాట్లాడారని స్పష్టం చేశారు.. బారికేడ్లు కూడా లేవని మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యేకి 250 మందిని పెట్టమని హోంమంత్రి అంటారు.. హోంమంత్రి గారు మీ వెటకారం ఎంతకాలం ఉంటుందో చూసుకోండి.. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో మీ పెర్ఫార్మెన్స్ మీద చెప్పించారు.. ఎప్పుడు ఊడుతోందో తెలియదు అని కామెంట్ చేశారు.. సంస్కారం గురించి మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది.. పదవులు శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.. పులివెందుల ఎమ్మెల్యేనా.. ఏంటా అనేది సరైన సమయంలో ప్రజలే చెబుతారని హెచ్చరించారు.. పోలీసుల బట్టలు వూడదీయిస్తామన్నారు అని అంటున్నారు.. విధి నిర్వహణలో నీతిగా నిజాయితీగా పనిచేస్తామని ప్రమాణం చేసి వచ్చి తప్పుడు పనులు చేస్తున్నారు… అయినా, కొందరు పోలీసుల గురించే జగన్ మాట్లాడారని తెలిపారు మాజీ మంత్రి పేర్ని నాని..