Site icon NTV Telugu

Pawan Kalyan: వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. జనసేన పదవి – బాధ్యత పేరుతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులాల గురించి మాట్లాడటానికి నాకు ఇబ్బంది ఉండదు.. అన్ని కులాలను పూర్తిగా అధ్యయనం చేసాను అన్నారు.. అయితే, వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదు.. ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బలమైన ఐడియాలజీ ఉంది కనుకే ధైర్యంగా ముందుకు అడుగు వేస్తాం.. ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా మాత్రమే చేస్తాం.. మంచిగా చెప్తాం.. మంచిగా మాట్లాడతాం.. వినకపోతే చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదు అని హెచ్చరించారు..

Read Also: New Income Tax Rules: ఇకపై డిజిటల్ ఖాతాలను వదలబోనంటున్న ఐటీ శాఖ.. అతి త్వరలో సరికొత్త రూల్స్ అమల్లోకి..!

సింగపూర్ అభివృద్ధి కావాలంటే అలాంటి పాలన ఉండాలి అన్నారు పవన్‌ కల్యాణ్‌.. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరన్న ఆయన.. వైసీపీ నాయకులు బెదిరింపు మాటలు మానేయండి.. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి అని సూచించారు.. వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆలోచన ఎవరైనా అధికారులకు, పోలీసులకు భయం ఉంటే వదిలేయండి వాళ్లు రారు అని జోస్యం చెప్పారు.. ఇక, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది లేకుండా చూస్తా అని పేర్కొన్నారు.. వైసీపీ నాయకులకి చెప్తున్నా రౌడీలను గంజాయి వాళ్లని కాపాడతాం అంటే లా అండ్ ఆర్డర్ ఎలా సెట్ అవుతుంది? అని నిలదీశారు.. క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరన్నారు.. క్రిమినాలిటీని కంట్రోల్ చెయ్యకపోతే గత ప్రభుత్వానికి మనకి తేడా ఏముంటుంది..? అని ప్రశ్నించారు.. పదవికి తీసుకున్న వారికి గట్టిగా చెప్తున్నా.. కొందరు అధికారులు, పదవుల్లో ఉన్న వాళ్లు మిస్ యూజ్ చేయకండి అని హెచ్చరించారు.. ప్రైవేట్‌ ఇష్యూస్‌లో కొందరు వేలు పెడుతున్నారు జాగ్రత్త.. ప్రజలకి కోపం వస్తే గట్టిగా బుద్ధి చెప్తారు అని వార్నింగ్‌ ఇచ్చారు.. మీరు తప్పులు చేస్తే ప్రజలు ఇప్పుడు ఏం మాట్లాడరు.. ఎన్నికల్లో చూపిస్తారన్న ఆయన.. నేను తప్పు చెయ్యను.. చేసే వాళ్లని చేయనివ్వను అని స్పష్టం చేశారు.. మనం తప్పు చేస్తే గత ప్రభుత్వానికి చెప్పినట్టే మనకి ప్రజలు బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్..

Exit mobile version