Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- అమరావతిలో జనసేన నేతలతో పవన్ కల్యా్ణ్ కీలక భేటీ..
- పార్టీ బలోపేతమే లక్ష్యం.. నేడు జనసేన సమావేశం..
- తాజా రాజకీయాలపై జనసేన మంతనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలో నేడు జనసేన పార్టీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు నోవాటెల్‌లో నిర్వహించనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకున్న ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అదేవిధంగా పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై నేతలకు పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేయనున్నారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సమావేశానికి ముందు పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటాయపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు వెంకటాయపాలెం చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు పవన్ కల్యాణ్.. ఓవైపు తనకు కేటాయించిన శాఖలలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూనే.. మరోవైపు.. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు పవన్.. ఇప్పటికే పార్టీ బలోపేతం కోసం వివిధ కమిటీలను సైతం ఏర్పాటు చేసిన విషయం విదితమే..
Also Read
- AP High Court: రుషికొండ భవనాల వినియోగంపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ సంక్షేమ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు.. మళ్లీ వైసీపీ విజయం ఖాయం..
- Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
- YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
తాజావార్తలు
-
Pawan Kalyan: నేడు జనసేన కీలక సమావేశం.. నేతలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
-
Donald Trump: ఇరాన్ నన్నే మొదట చంపాలనుకుంటోంది.. టర్కీలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ramayana: భారత్ మండపంలో గ్రాండ్ ఈవెంట్.. ‘రామాయణం’ ట్రైలర్‌కు భారీ ప్లాన్!
-
Astrology: జూలై 9 గురువారం దినఫలాలు.. మీది ఈ రాశియా? అయితే జాగ్రత్త..
-
US strikes on Iran: అమెరికా దూకుడు.. ఇరాన్లో పేలుళ్ల మోత!.. ట్రంప్ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తత మరింత తీవ్రం
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..