Pawan Kalyan: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది.. అయితే, అజ్ఞాతంలోనే ఉన్నారు ఆర్జీవీ.. మరోవైపు.. వర్మను అదుపులోకి తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.. ఇక, మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఆర్జీవీ.. ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆర్జీవీ వివాదంపై స్పందించారు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్‌కు ఆర్జీవీ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి.. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్ కల్యాణ్..
Read Also: Prabhas: విదేశాలకు ప్రభాస్.. ఆ హీరోయిన్‌లలో ఎవరితో రొమాన్స్?
ఇక, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపతాయిస్తున్నారు.. అనే విషయాన్ని ముఖ్యమంత్రిని అడుగుతాను.. ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగారని చెప్తాను అన్నారు పవన్ కల్యాణ్.. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీపై ఆయన మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కు బడ్జెట్ ను పెంచమని కేంద్ర మంత్రిని కోరాం.. సమయం పొడగించమని కోరాం అన్నారు.. పోలవరం పై ముఖ్యమంత్రి మాట్లాడుతారన్న ఆయన.. గత ప్రభుత్వం చేసిన తప్పులు.. వారసత్వంగా వస్తున్నాయి.. వాళ్ల తప్పుల వల్ల మనం మాట పడుతున్నాం.. ఏపీలో జనజీవన్ మిషన్ పై రెండు మూడు వారాల్లో డీపీఆర్ ఇస్తాం అన్నారు.. మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు ఉపరాష్ట్రపతి.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుస్తాం అన్నారు పవన్.
Read Also: Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్
ప్రధాని మోడీతో కూడా జల జీవన్ మిషన్ పై చర్చిస్తాను అన్నారు పవన్ కల్యాణ్.. పీఎం కోరిక ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు అందించాలని.. ఏపీలో పైప్ లైన్స్.. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి.. వాటర్ ప్రెషర్ సరిపోవడం లేదు.. మోటార్లు పెట్టి నీటిని లాగితే.. ఆ తర్వాత ఉన్న వాళ్లకు నీళ్లు రావటం లేదు.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాను అని తెలిపారు.. సౌర విద్యుత్ టెండర్ల అవినీతిపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. సమోసలకే 9 కోట్లు ఖర్చు పెట్టారు.. బాధ్యతా రాహిత్యం.. బయాలు లేవు.. పారదర్శకత అస్సలు లేదు గత ప్రభుత్వంలో అని దుయ్యబట్టారు.. భవిష్యత్ లో ఇలా పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇక, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..