పవన్ కల్యాణ్‌కు ఆర్జీవీ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి.. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్ కల్యాణ్..