Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Pawan Kalyan Reacts On Rgv Issue

Pawan Kalyan: ఆర్జీవీ వివాదంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :November 26, 2024 , 2:38 pm
By Sudhakar Ravula
  • దర్శకుడు ఆర్జీవీ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం..
  • ఢిల్లీలో పవన్ కల్యాణ్ కు మీడియా నుంచి ప్రశ్నలు..
  • నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని వ్యాఖ్య..
  • లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చేయడం లేదన్న పవన్..
Pawan Kalyan: ఆర్జీవీ వివాదంపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan: సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతూనే ఉంది.. అయితే, అజ్ఞాతంలోనే ఉన్నారు ఆర్జీవీ.. మరోవైపు.. వర్మను అదుపులోకి తీసుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.. ఇక, మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఆర్జీవీ.. ఈ రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.. ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆర్జీవీ వివాదంపై స్పందించారు కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌కు ఆర్జీవీ వ్యవహారంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.. గతంలో పోలీసులు ఎక్కడున్నా పట్టుకునేవాళ్లు.. ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు దొరకడం లేదు..? ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనే తరహాలో మీడియా నుంచి ప్రశ్నలు వచ్చాయి.. దీనిపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. నా పని నేను చేస్తున్నా.. పోలీసులు పని వాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు.. లా అండ్ ఆర్డర్ హోం మంత్రి చూస్తారు.. నేను చెయ్యడం లేదు అంటూ నవ్వుతూ బదులిచ్చారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: Prabhas: విదేశాలకు ప్రభాస్.. ఆ హీరోయిన్‌లలో ఎవరితో రొమాన్స్?

ఇక, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపతాయిస్తున్నారు.. అనే విషయాన్ని ముఖ్యమంత్రిని అడుగుతాను.. ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగారని చెప్తాను అన్నారు పవన్‌ కల్యాణ్‌.. కేంద్ర జలశక్తి మంత్రితో భేటీపై ఆయన మాట్లాడుతూ.. జలజీవన్ మిషన్ కు బడ్జెట్ ను పెంచమని కేంద్ర మంత్రిని కోరాం.. సమయం పొడగించమని కోరాం అన్నారు.. పోలవరం పై ముఖ్యమంత్రి మాట్లాడుతారన్న ఆయన.. గత ప్రభుత్వం చేసిన తప్పులు.. వారసత్వంగా వస్తున్నాయి.. వాళ్ల తప్పుల వల్ల మనం మాట పడుతున్నాం.. ఏపీలో జనజీవన్ మిషన్ పై రెండు మూడు వారాల్లో డీపీఆర్‌ ఇస్తాం అన్నారు.. మరోవైపు.. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు ఉపరాష్ట్రపతి.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుస్తాం అన్నారు పవన్‌.

Read Also: Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్

ప్రధాని మోడీతో కూడా జల జీవన్ మిషన్ పై చర్చిస్తాను అన్నారు పవన్‌ కల్యాణ్.. పీఎం కోరిక ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు అందించాలని.. ఏపీలో పైప్ లైన్స్.. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి.. వాటర్ ప్రెషర్ సరిపోవడం లేదు.. మోటార్లు పెట్టి నీటిని లాగితే.. ఆ తర్వాత ఉన్న వాళ్లకు నీళ్లు రావటం లేదు.. క్షేత్ర స్థాయిలో పరిశీలించాను అని తెలిపారు.. సౌర విద్యుత్ టెండర్ల అవినీతిపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. సమోసలకే 9 కోట్లు ఖర్చు పెట్టారు.. బాధ్యతా రాహిత్యం.. బయాలు లేవు.. పారదర్శకత అస్సలు లేదు గత ప్రభుత్వంలో అని దుయ్యబట్టారు.. భవిష్యత్ లో ఇలా పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్.. ఇక, ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Delhi
  • pawan kalyan
  • ram gopal varma
  • RGV Issue

తాజావార్తలు

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

  • Story Board: ఆ ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions