Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని డిప్యూటీ సీఎం, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో రూ.2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో నల్లాని నందకుమార్‌తో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో భారీ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని పవన్ అభినందించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణాలో గణనీయమైన తగ్గుదల నమోదైందని డిప్యూటీ సీఎం తెలిపారు. గత రెండేళ్లలో స్మగ్లింగ్ కార్యకలాపాలు 70 శాతం వరకు తగ్గాయని వెల్లడించారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో 90 శాతం మందికి పైగా శిక్షలు పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదగా భావించే ఎర్రచందనం సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతర్రాష్ట్ర సమన్వయంతో స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపుతున్నామని, అటవీ సంపద పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎర్రచందనం అక్రమ రవాణాపై మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Also Read
- Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
- Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
- YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!