Site icon NTV Telugu

Andhra Pradesh: అమావాస్య ఎఫెక్ట్..! వెలవెల బోతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు..

Registration

Registration

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భూముల మార్కెట్‌ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల ధరలు పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు రద్దీగా మారతాయని అందరూ అనుకుంటారు.. కానీ, ఏపీలో రిజిస్ట్రేషన్లపై అమావాస్య ఎఫెక్ట్ పడింది.. మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు గత రెండు రోజులుగా రద్దీగా ఉన్నాయి.. అయితే, రేపు అమావాస్య కావడంతో దాని ప్రభావం ఇవాళ, రేపు రెండు రోజులు పడింది.. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.. ఈ నెలాఖరు చివరి రెండు రోజులుగా ఉన్న 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారే అవకాశం ఉంది..

Read Also: Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్

కాగా, జనవరి 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరుగుతాయనే ప్రచారం సాగింది.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగినా.. పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా వేసింది సర్కార్.. తాజాగా మార్కెట్‌ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ నేపథ్యంలో భూముల విలువ 10 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అయితే, రాజధాని అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ర్టేషన్‌ చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.. ఇదే సమయంలో డిమాండ్‌ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖ లాంటి తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా పెంచేందుకు సిద్ధమైంది ప్రభుత్వం..

Exit mobile version