New Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.. మొత్తం 3396 దుకాణాల్లో ఇప్పటివరకు దాదాపు 1500 షాపుల కేటాయింపు పూర్తి అయ్యింది.. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 86 దుకాణాల కేటాయింపు పూర్తి కాగా.. కర్నూలు జిల్లాలో మందకోడిగా లాటరీ.. కేవలం 19 షాపులకే లాటరీ పూర్తి చేశారు.. మిగతా మద్యం దుకాణాల కోసం 26 జిల్లాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది.. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి మద్యం దుకాణాలు దక్కనట్టుగా తెలుస్తోంది.. లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 16 నుండి నూతన మద్యం పాలసీ ప్రారంభం కానుంది.. ప్రైవేటు మద్యం షాపుల్లో కొత్తగా రానున్నాయి లిక్కర్ బ్రాండ్లు.. ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరుకుంటున్నాయి ప్రీమియం బ్రాండ్ ల మద్యం బాటిళ్లు.. బ్లాక్ అండ్ వైట్, మైక్ డోవెల్ లగ్జరీ, రాయల్ ఛాలెంజ్, సియాగ్రామ్, వాట్ 69 స్కాచ్, విస్కీ బాటిళ్లు సహా మరికొన్ని బ్రాండ్‌లో అందుబాటులోకి రానున్నాయి.. బీర్లలో ఎలిఫెంట్, హెన్కిన్ వంటి పాత బ్రాండ్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని అంటున్నారు స్టాక్ పాయింట్ అధికారులు..
Read Also: Baba Siddique Murder: లారెన్స్ బిష్ణోయ్‌ను ముంబై పోలీసులు కస్టడీలోకి ఎందుకు తీసుకోలేకపోతున్నారు..?
మొత్తంగా ప్రీమియం లిక్కర్ కిక్కు కోసం ఎదురు చూస్తున్న మందుబాబులు ఇక నుంచి పండుగ చేసుకొనే సమయం వచ్చేస్తోంది.. వీటిలో 8 రకాల బీర్లు, వందల రకాల IML బ్రాండ్లు వున్నాయి అంటున్నారు.. వీటిలో KF తో పాటుఎలిఫెంట్, హేనికిన్ బీర్లకు డిమాండ్ ఎక్కువగా వుంది. ఇక, ప్రీమియం లిక్కర్ లో బ్లాక్& వైట్ , మెక్ డోవెల్, ఇంపీరియల్ బ్లూ , రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్ల తో వైన్ షాపులు కళకళ లాడబోతున్నాయి.. కొత్త మద్యం బ్రాండ్లతో గోడౌన్లు నిండిపోతున్నాయి.. గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన మద్యం బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్స్ గోడౌన్స్ కు చేరుకున్నాయి. మద్యం షాపులకు లాటరీ ద్వారా వ్యాపారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే రేపటి నుంచి ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేయనున్నారు. కొత్త మద్యం షాపులలో కొత్త మద్యం బ్రాండ్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తేవడం కోసం ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ఐఎంఎల్ గోడౌన్స్‌కు మద్యం లారీలు చేరుకున్నాయి. లిక్కర్, బీర్లు.. ఇలా ఇప్పటికే గోడౌన్లకు చేరుకోగా మరికొంత రేపటిలోగా చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.. కాగా, రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం విదితమే..