NTV Telugu Site icon

DSC Notification: గత ప్రభుత్వమిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు

Dsc

Dsc

DSC Notification: ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ముందుకు సాగలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఇటీవలే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ -2024ను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనితో పాత డీఎస్సీను ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలోనే 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది.

Read Also: Andhra Premier League: విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి.. నేటి నుంచి మ్యాచ్‌లు షురూ..

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించింది. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీతో పాటు టెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.