DSC Notification: గత ప్రభుత్వమిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
- ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వమిచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
- ఈ మేరకు జీవో 256ను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC Notification: ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నెం.256ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉద్యోగాల భర్తీ ముందుకు సాగలేదు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఇటీవలే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ -2024ను టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనితో పాత డీఎస్సీను ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలోనే 16,347 పోస్టులతో నూతన డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుంది.
Read Also: Andhra Premier League: విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందడి.. నేటి నుంచి మ్యాచ్‌లు షురూ..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించింది. దీంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇప్పటికే టెట్ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మెగా డీఎస్సీ కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాల్స్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!