Site icon NTV Telugu

Nara Lokesh: కేటీఆర్‌ని ఎందుకు కలవకూడదు..? దానికి రేవంత్‌రెడ్డి పర్మిషన్‌ తీసుకోవాలా..?

Lokesh

Lokesh

Nara Lokesh: కేటీఆర్‌ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్‌.. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానన్న ఆయన.. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలా?.. రేవంత్‌ రెడ్డి పర్మిషన్‌ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.. ఇక, బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయిన ఎమ్మెల్సీ కవితను టీడీపీలో తీసుకోవడమంటే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నట్టే అంటూ హాట్‌ కామెంట్లు చేశారు నారా లోకేష్‌.. మరోవైు, తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ఫోకస్‌ చేస్తుందన్నారు లోకేష్.. అయితే, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. మరోవైపు, తాజా ఉపరాష్ట్రపతి ఎన్నికలపై స్పోందిస్తూ.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో వైఎస్‌ జగన్‌ను వైసీపీ ఎంపీలు అడగాలని సూచించారు నారా లోకేష్.. ఇప్పుడే కాదు.. 2029 ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు.

Read Also: Apple Event 2025 Live: ‘ఐఫోన్’ 17 లాంచ్ ఈవెంట్ లైవ్

ఇక, రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయని తెలిపారు నారా లోకేష్.. అవన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు.. ఆ భయంతోనే వైఎస్‌ జగన్‌ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్‌ స్కా కేసులో ప్రభుత్వ జోక్యం లేదని పేర్కొన్నారు లోకేష్.. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు నారా లోకేష్.. కాగా, ఓవైపు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీపై.. తెలంగాణలో టీడీపీ పునర్‌నిర్మాణం, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల సమయంలో.. ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి..

Exit mobile version