NTV Telugu Site icon

MP Mopidevi Venkata Ramana: వైసీపీకి మరో బిగ్‌షాక్‌..? రాజీనామాకు సిద్ధమైన ఎంపీ..!

Mopidevi Venkata Ramana

Mopidevi Venkata Ramana

MP Mopidevi Venkata Ramana: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు పార్టీకి దూరంగా జరిగారు.. కొందరు పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తు్న్నారు.. మరోవైపు.. మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు.. కార్పొరేటర్లు.. కౌన్సిలర్లు.. ఇలా ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు.. అయితే, ఇప్పుడు వైసీపీకి బిగ్‌ షాక్‌ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. దీనిపై రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Read Also: PM Modi’s US Tour: న్యూయార్క్‌లో ప్రధాని మోడీ మెగా ఈవెంట్‌.. భారీ స్పందన

ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామాచేసిన అనంతరం, రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ ప్రకటించే అవకాశం ఉందట.. అంతేకాదు.. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీసీలె చేరే అవకాశం ఉందంటున్నారు.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న మోపిదేవి వెంకటరమణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి వస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మోపిదేవికి ఓటమి తప్పలేదు.. అయినా.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. తన తొలి కేబినెట్‌లో మోపిదేవికి మంత్రి పదవి కట్టబెట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి.. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించిన విషయం విదితమే.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగాను.. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెబితే.. వైసీపీకి భారీ షాక్‌ తగిలినట్టే అవుతుంది.