NTV Telugu Site icon

Mopidevi and Masthan Rao: వైసీపీకి గుడ్‌బై.. ఎంపీ పదవికి మోపిదేవి, బీద మస్తాన్‌రావు రాజీనామా.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Mopidevi

Mopidevi

Mopidevi and Masthan Rao: ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..

Read Also: MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీద మస్తాన్‌రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను.. రాజకీయ భవిష్యత్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటాను అన్నారు.. వ్యక్తిగత కారణాలే నా రాజీనామాకు కారణంగా పేర్కొన్నారు.. సాంకేతికంగా, సంప్రదాయంగా రాజ్యసభ ఛైర్మన్ కొన్ని ప్రశ్నలు అడిగారు.. ఇష్టపూర్వకంగానే రాజీనామాలు చేశామని ఇద్దరం చెప్పామని వెల్లడించారు.. రాజ్యసభ సభ్యునిగా వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు.. దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.. నాకు ముందు నుంచి కూడా జాతీయ రాజకీయలంటేనే ఇష్టం.. రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీద మస్తాన్‌రావు..

Read Also: Chiranjeevi – Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. ఒకే వేదికపై చిరు, బన్నీ?

ఇక, మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాలే నాకిష్టమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. స్థానికంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉండాలన్నదే నాకిష్టం అన్నారు.. తెలుగుదేశం పార్టీలో తేరబోతున్నాన్నది వాస్తవమే.. ఇందులో దాచేదేమీ లేదన్నారు.. రాజకీయంగా మనుగడ సాగించేందుకు, సముచితమైన రీతిలోనే నాకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు…అందుకు కృతజ్ఞతలు తెలుపుున్నారు.. అయితే, రేపల్లె అసెంబ్లీ స్థానానికి నాకంటే సమర్ధుడికి ఇచ్చినా నాకు అభ్యంతరం ఉండేది కాదన్నారు.. ఎంత చెప్పినా, పార్టీ అధినాయకత్వం వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నన్ను కాదనుకున్నప్పుడు, నాకంటే సమర్ధుడుకు టికెట్ ఇచ్చినా సరిగ్గా ఉండేది అన్నారు మోపిదేవి వెంకటరమణ.