Site icon NTV Telugu

Payyavula Keshav: రప్పా.. రప్పా నరుకుతారట.. ఎవర్ని ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..?

Payyavula Keshav

Payyavula Keshav

Payyavula Keshav: రప్పా.. రప్పా నరుకుతాం.. అంటే.. సంతోషం అంటారు జగన్..! ఖండించాలి కదా..? రప్పా.. రప్పా.. ఎవర్ని నరుకుతారు.. ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..? అని ప్రశ్నించారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశంలో చేసిన కామెంట్లపై స్పందించిన పయ్యావుల.. రాష్ట్రంలో రౌడీలు తన వెనక నడవమని జగన్ చెప్తున్నారు.. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ లు చేశారు.. అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారని విమర్శించారు.. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణుక్యుడు బందిపోటులను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడు.. ఇప్పుడు అదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారు.. గంజాయి, బ్లెడ్ బ్యాచ్‌ను ప్రోత్సాహిస్తున్నారు.. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి.. రప్పా.. రప్పా నరుకుతాం అంటున్నారని మండిపడ్డారు..

Read Also: Abhishek Bachchan : వాళ్లకు అన్నీ ఇచ్చేసా.. ఒంటరిగా ఉంటా.. అభిషేక్ బచ్చన్ పోస్ట్..

అయితే, అరాచక పాలనను రప్పా రప్పా నరికి ఏడాది అయ్యిందన్నారు పయ్యావుల.. ఇది చంద్రబాబు ప్రభుత్వం.. ఫ్యాక్షన్ నేతలను చాలా మందిని చూసారు.. ఇలాంటి అరాచకాలు సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు.. రప్పా.. రప్పా నరుకుతాం.. అంటే సంతోషం అంటారు వైఎస్‌ జగన్‌.. ఖండించాలి కదా.? అని ప్రశ్నించారు.. ఎవర్ని నరుకుతారు.. ప్రజలనా.. ప్రజాస్వామ్యన్నా.? అని మండిపడ్డారు.. ఓటమి తర్వాత మార్పు కనపడడం లేదు.., తెనాలి వెళ్లి రౌడీ షీటర్ లను పరామర్శించారు.. పొదిలిలో మహిళల పై అరాచకాలు చేశారు.. నిన్న నాగ మల్లేశ్వర రావు విగ్రహ ప్రతిష్ఠకు వచ్చారు.. ఇద్దరు చనిపోయారు.. కనీసం, జగన్ పరామర్శించారా? అని ఫైర్‌ అయ్యారు.. పరామర్శకు వెళ్లి కులం ప్రస్తావన ఎందుకు? నాని, వంశీ.. చెవిరెడ్డి.. వీరు అమాయకులా? అని ప్రశ్నించారు పయ్యావుల కేశవ్‌..

Read Also: Triumph Speed T4: అబాబ్బా.. ఆరెంజ్ కలర్‌లో బైక్ ఏమైనా ముద్దు వస్తుందా.. ఫీచర్స్, ధరలు ఇలా..!

పవన్ వస్తే అడ్డుకున్న రోజులు మర్చిపోయారా..? అని జగన్‌ను నిలదీశారు పయ్యావుల.. చంద్రబాబు ప్రభుత్వం ఉంది కాబట్టే రాష్ట్రంలో జగన్ స్వేచ్చ గా తిరుగుతున్నారన్న ఆయన.. కాల్ సెంటర్ పెట్టి అందరికి ఫోన్లు చేసి రోడ్డెక్కారు.. హింస ప్రేరేపించడం కాదా? అని ప్రశ్నించారు.. జగన్ తన పర్యటనలో ఏమి చెప్పదలుచుకున్నారు.. రాష్ట్రంలో అరాచకం విధ్వంసం సృష్టించే విధంగా జగన్ పర్యటనలు జరుగుతున్నాయి. తల్లికి వందనం ఇస్తే కడుపు మంటా.. ఉద్యోగాలు ఇస్తామంటే కడుపు మంటా.. లిక్కర్ కేసులో విషయాలు బయటికి వస్తే దేశం నివ్వెర పోతుంది.. లిక్కర్ కేసులో ఇంకా విచారణ జరుగుతోందన్నారు.. ఇక, రాష్ట్ర అభివృద్ధి పై కుట్ర జరుగుతోంది.. చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి వివరాలు వచ్చాక స్పందిస్తాం అన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌..

Exit mobile version