NTV Telugu Site icon

Nimmala ramanaidu: ఉచిత ఇసుక, తల్లికి వందనంపై విష ప్రచారం.. మండిపడ్డ మంత్రి

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Nimmala ramanaidu: తల్లికి వందనం, ఉచిత ఇసుక పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. తల్లికి వందనం పథకంపై వైసీపీ విషప్రచారం చేస్తుందని.. వీళ్ల అబద్ధాలు, అసత్యాలు 30 రోజులుగా చూస్తూనే ఉన్నామని.. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పామని.. కానీ, ఈరోజు ఒకరికి ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని.. ఇంకా ఆ పథకాన్ని గ్రౌండ్ లెవెల్ లో అమలు చేయలేదు.. ఎలా అమలు చేయాలి.. ఎంతమందికి ఇవ్వాలనేది కార్యాచరణ రూపొందించకుండానే అప్పుడే వీల్లేదో సెక్రటరీ ఇంట్లో, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేష్ మనసులో ఏముందో తొంగి చూసినట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్‌’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

ఇప్పటికీ మళ్లీ చెప్తున్నా.. తెలుగుదేశం – జనసేన – బీజేప ప్రభుత్వం అంటే మాట ఇస్తే మడమ తిప్పని ప్రభుత్వమని, మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వం అన్నారు మంత్రి నిమ్మల.. అందుకు గత 30 రోజుల పరిపాలన ఉదాహరణ అన్నారు. తల్లికి వందనం పథకాన్ని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అందిస్తామని భరోసా కల్పించారు. గత 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమతిప్పి ఇద్దరికి కాదు ఒకరికే అన్నారు.. ఆ రోజు ఒక సంవత్సరం 15 వేల రూపాయలు తర్వాత సంవత్సరం 14 వేలకు కోత విధించారని.. తర్వాత సంవత్సరం 13 వేలకు కుదించి కోత వేశారని మరల ఒక సంవత్సరం పూర్తిగా అమ్మఒడికే కోత వేశారని.. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు మాత్రమే అమ్మఒడి వేశారని విమర్శించారు.

Read Also: Anant ambani wedding: ముందస్తు పెళ్లి వేడుకల్లో రాధిక లుక్‌లు ఇవే!

జగన్మోహన్ రెడ్డి మాదిరిగా కోతలు లేకుండా ఐదు సంవత్సరాలు కూడా పిల్లలందరికీ అన్నమాట ప్రకారం తల్లికి వందనం అందిస్తామని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. అలాగే ఉచిత ఇసుక పై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు సైతం కౌంటర్ ఇచ్చారు.. మీకు కావాలంటే ఒక ఎడ్ల బండి తోను ఒక బకెట్ తోను వెళ్లి తీసుకును ఉచితంగా తెచ్చుకోవచ్చని.. ఏదైతే ఐదు యూనిట్లు మూడు యూనిట్లు లారీ లేదా ట్రాక్టర్లో తెచ్చుకునే వారికి రవాణా ఖర్చులు మరియు ఎగుమతి చార్జీలు ఉంటాయన్నారు. మీ అంతట మీరు తెచ్చుకునేందుకు ఉచితంగానే అందిస్తామని మంత్రి నిమ్మల అన్నారు. మరోవైపు.. విశాఖ హుక్కు ప్రైవేటీకరణకు ఆరోజున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని అసత్య ప్రచారం చేశారని.. ఏదైతే నిన్న కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగేది లేదని స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఈ రకంగా అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేసే వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి నిమ్మల రామానాయుడు.

Show comments