Minister Nara Lokesh: ఇంకా రెడ్ బుక్ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు..
- అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో లోకేష్ హాట్ కామెంట్లు..
- నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పా..
- తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా..
- ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఇంకా రెడ్ బుక్ తెరవలేదు.. అప్పుడే గగ్గోలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు మంత్రి నారా లోకేష్.. ఈ రోజు అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేష్ కు వినతులు వెల్లువెత్తాయి.. లోకేష్ ని కలిశారు పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు.. తమ తమ బయోడేటాలు లోకేష్ కు అందజేశారు.. అయితే, పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. ఇక, అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో హాట్ కామెంట్లు చేశారు లోకేష్.. నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పాను అని గుర్తుచేశారు.. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాను అని స్పష్టం చేశారు.. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు మంత్రి.
Read Also: Poisonous Snakes: ఏటా ఘనంగా పాముల జాతర..విషసర్పాలను నోటిలో కరచుకుని ఊరేగింపు
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తుచేసిన మంత్రి లోకేష్.. రెడ్ బుక్ కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడు అని దుయ్యబట్టారు.. గత 5ఏళ్ల కాలంలో జగన్ రెండు ప్రెస్మీట్లు పెడితే.. 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు ప్రెస్మీట్లు పెట్టాడు అంటూ ఎద్దేవా చేశారు.. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే.. వాస్తవాలు మేం వివరిస్తాం కదా? అని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తాం అన్నారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరు, వైఎస్ జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరు అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!