Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Minister Nara Lokesh Felicitates Students Of Government Colleges Who Achieved Top Marks In Inter

Nara Lokesh: ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు సన్మానం.. హ్యాట్సాఫ్..! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా..!!

Published Date :April 15, 2025 , 8:10 pm
By Sudhakar Ravula
  • “షైనింగ్ స్టార్స్-2025” పేరుతో విద్యార్థులకు సన్మానం..
  • విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్ ట్యాప్ బహుకరణ..
  • మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు..
  • మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్-మంత్రి లోకేష్..
  • మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నానంటూ మంత్రి భావోద్వేగం..
Nara Lokesh: ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు సన్మానం.. హ్యాట్సాఫ్..! మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా..!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nara Lokesh: మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మీరంతా విజేతలు.. మీకు హ్యాట్సాఫ్.. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాని భావోద్వేగానికి గురయ్యారు. ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసించి మార్కుల్లో రాష్ట్రస్థాయి టాపర్ లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను “షైనింగ్ స్టార్స్-2025” పేరుతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించి సన్మానించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన “షైనింగ్ స్టార్స్-2025” కార్యక్రమంలో విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించి ల్యాప్ ట్యాప్ లను బహూకరించారు.

Read Also: IND vs BAN: బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

ఇక, ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థుల విజయాన్ని సెలబ్రేటే చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాం.. పేదరికం వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారు. పాయకాపురంలో ఓ చెల్లితో మాట్లాడినప్పుడు.. తల్లిదండ్రులను కోల్పోయిన తనను చేపలమ్మి వాళ్ల అమ్మమ్మ చదివిస్తోందని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించడం వల్ల ఆమెపై భారం తగ్గిందని చెప్పారని గుర్తు చేసుకున్నారు.

Read Also: Bhatti Vikramarka : మాతో కలిసి నడవండి.. బహుజన శక్తిని చాటి చెప్పండి

ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను మీరు చెరిపివేశారంటూ అభినందించారు మంత్రి లోకేష్.. మీరందరూ విజేతలు. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు. ఇవాళ మీరందరూ బ్రాండ్ అంబాసిడర్స్. విద్యార్థుల మధ్య పోటీ ఉండాలి. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆడుతూ, పాడుతూ ఉండేవాడిని. క్రికెట్ ఆడేవాడిని. పదో తరగతికి వచ్చిన తర్వాత నన్ను బాగా రుద్దారు. నేను కూడా రుద్దుడు బ్యాచ్ నే. తర్వాత ఇంటర్ రెండేళ్లు బాగా కష్టపడ్డాను. మూడేళ్ల పాటు చాలా కీలక సమయం. తర్వాత స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చేశాను. వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంటర్ విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. టెక్ట్స్, నోట్ పుస్తకాలు అందించడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాం. ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇలా అనేకం చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. విద్యాశాఖలో జూన్ నాటికి సంస్కరణలు పూర్తిచేసి అనంతరం లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృషి పెడతామని పేర్కొన్నారు..

Read Also: Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?

మిమ్మల్ని చూసి చాలామంది ఇన్ స్పైర్ కావాలన్నారు లోకేష్… టాప్ మార్కులు సాధించిన వారిలో బాలికలు ఎక్కువమంది ఉన్నారు. వ్యాపారంలో కూడా మహిళలు చాలా బాగా రాణిస్తారు. చదువు, వ్యాపారంలో నాకంటే బ్రాహ్మణి చాలా బెటర్. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలి. అన్నివిధాల ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు విదేశీ విద్యకు ప్రత్నామ్నాయం తీసుకువస్తాం. నేను స్టాన్ ఫోర్డ్ లో ఎంబీఏ చదివేందుకు వెళ్లినప్పుడు మీ వద్ద ఎన్ని డబ్బులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని అడగలేదు. ఇంటర్వూ తర్వాత కావాల్సిన వారికి లోన్, ఇంటర్నషిప్ అందిస్తారన్నారు.. అయితే, డబ్బులు లేవని పిల్లలు ఇబ్బందిపడకూడదనేది మా లక్ష్యం. మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాల వల్లే. ఇది మర్చిపోకూడదు. కఠిన సవాళ్లు ఎదురైనా ఎదుర్కోవాలి. 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని నేను ఎంచుకుని పోటీ చేశా. అనేక ఇబ్బందులు ఎదుర్కొని విజయం సాధించాను. స్ట్రగుల్ ఉన్నప్పుడే గెలుస్తారు. కష్టమైనా ఏరికోరి విద్యాశాఖను ఎంచుకున్నా. టార్గెట్ పెట్టి మరీ సీఎం చంద్రబాబు నాకు ఈ శాఖను అప్పగించారు. ఇంటర్ తర్వాత కూడా ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి. అందరూ ఐటీ వైపే వెళ్లానుకోవడం కరెక్ట్ కాదు. ఇవాళ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి క్లియర్ అయింది. నెల్లూరు, అనకాపల్లి సోలార్ ఎనర్జీ ప్లాంట్ లు వస్తున్నాయి. కనిగిరిలో రిలయన్స్ కంప్రెస్ట్ బయో గ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటుచేసింది. కొత్త సెక్టార్స్ వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా రంగాలను ఎంచుకోవాలని సూచించారు.

Read Also: Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?

జీవితం అనేది జర్నీ.. నాట్ డెస్టినేషన్.. ఈ మధ్య కాలంలో విద్యార్థులు బాగా సున్నితంగా ఉంటున్నారన్నారు లోకేష్. ఇంటర్ ఫలితాలు ఎలా విడుదల చేయాలనేది మేం రెండు గంటల పాటు చర్చించాం. లక్ష్యం కోసం పనిచేయాలి. చిన్నచిన్న ఆటుపోట్లు ఎదురైనా తట్టుకోవాలి. మీకు అన్ని విధాల సహకారం అందిస్తాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తాం. కలల సాధనకు కష్టపడాలి. ప్రోత్సహించే బాధ్యత నాది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో వసతులను మెగురుపరుస్తాం. ఇంటర్మీడియట్ లో యూనిఫాం అందిస్తే బాగుంటుందని చాలా మంది విద్యార్థులు కోరారు. మీ ఫీడ్ బ్యాక్ ను సీరియస్ గా తీసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. సమస్యలు ఏవైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఇంటర్ తర్వాత కాలేజీలకు వెళ్తారు. ఫ్రీడమ్ ను దుర్వినియోగం చేసుకోవద్దు. కాలేజీల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ను చేపట్టాం. చాలా సీరియస్ గా తీసుకున్నాం అన్నారు. జీవితాంతం కుటుంబానికి అండగా ఉండాలి. నేను కూడా పనిఒత్తిడిలో మా అమ్మగారితో, దేవాన్ష్ తో మాట్లాడాలనే విషయం మిస్ అవుతున్నా. ఎదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించాలి. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతల గురించి కూడా మాట్లాడాలి. స్వచ్ఛతలో మంగళగిరిని నెం.1గా మార్చే క్రమంలో వెయ్యి టన్నుల చెత్త బయటపడింది. మన పరిసరాలను చెత్త రహితంగా ఉంచుకోవాలి. మీరంతా జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ కావాలన్నారు. మీరంతా విజేతలు. మీకు హ్యాట్సాఫ్..! మీరంతా ప్రభుత్వ విద్య పరువును కాపాడారు.. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాను అని అభినందించారు మంత్రి నారా లోకేష్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Government
  • government colleges
  • Inter
  • Minister Nara Lokesh

తాజావార్తలు

  • RCB: ఆర్సీబీ విజయాలకు ముఖ్య కారణం ఈ 5 గురే.. వేలంలో తక్కువ ధరకు వచ్చి.. దుమ్ము లేపుతున్న గెలుపు గుర్రాలు..

  • Opinion Poll 2026: బెంగాల్‌లో గెలుపు బీజేపీదా, టీఎంసీదా.. ఒపీనియన్‌ పోల్స్‌లో సంచలన ఫలితాలు..

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions