Nara Lokesh: సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభకు మంత్రి నారా లోకేష్ దూరం.. ఎందుకో తెలుసా..?
- మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు..
- నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కి తీసుకురావడంపై లోకేష్ దృష్టి..
- సచివాలయంలో ఆర్టీజీఎస్ వేదికగా ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు..
- కేంద్రంతో పాటు మంత్రులు, అధికారులతో మంత్రి నారా లోకేష్ సమన్వయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: అనంతపురంలో ఇవాళ జరగనున్న సూపర్ సిక్స్- సూపర్ హిట్ బహిరంగ సభకు ఏపీ మంత్రి నారా లోకేష్ దూరంగా ఉంటున్నారు. నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ఆయన దృష్టి పెట్టారు. ఇందుకోసం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ సెంటర్ లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో సమన్వయం చేయనున్నారు. అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ కేంద్రానికి రావాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలుగువారి వివరాలు సేకరించి తక్షణమే వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంపై నారా లోకేష్ కార్యాచరణ ప్రారంభించనున్నారు.
Read Also: Taapsee Pannu : బక్కచిక్కిపోయిన తాప్సీ లుక్ వైరల్ – హెల్త్‌పై ఫ్యాన్స్ టెన్షన్
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
అయితే, నేపాల్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 187 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా నేపాల్ లోని నాలుగు ప్రాంతాల్లో ఉన్నారు. బఫాల్ లో చిక్కుకున్న 27 మంది శ్రీధరాచార్యుల పర్యవేక్షణలో ఉండగా.. సిమిల్ కోట్ లో కారి అప్పారావు దగ్గర 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగలస్థాన్ లో 90 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. నేపాల్ లోని భారత రాయబారి నవీన్ శ్రీ వాస్తవకు పరిస్థితిని వివరించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. తెలుగు ప్రజల భద్రతే ప్రాధాన్యంగా మంత్రి నారా లోకేష్ కేంద్ర ఏజెన్సీలు, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!