NTV Telugu Site icon

Nadendla Manohar: విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజలకు మార్పు చూపించాలనే మా ఆలోచన

Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.. గత ఐదేళ్ల పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతో ఇబ్బందులు ఎదుర్కొని చితికిపోయారు.. రైతు భుక్తే ప్రమాదంలోకి నెట్టేశారు.. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలకు కూడా బకాయిలు పెట్టేశారు.. 36,300 కోట్ల రూపాయల అప్పుల పాలు చేశారు… 1659 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెట్టారని మండిపడ్డారు.. అయితే, రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి బాధ్యత మాది.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రైతుల అంశంపై సానుకూలంగా స్పందించారు.. రైతుల‌ బకాయిలు తీర్చడానికి 1000 కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు మంజూరు చేశారని వెల్లడించారు.

Read Also: Bansuri Swaraj: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌ సభ్యురాలిగా బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్‌ నియామకం

ఇక, ఆహార భద్రత కూడా మా బాధ్యత.. బియ్యం, నిత్యవసర సరుకులు తూకంలో తేడా వచ్చినా, పక్కదారి పట్టించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి నాదెండ్ల.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందని ఆరోపించిన ఆయన.. ఇంకా తనిఖీలు చేస్తాం.. ద్వారంపూడి కుటుంబంపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.. కచ్చితంగా స్ధానిక కలెక్టర్ తో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్నాం.. రైతుల పొట్ట కొట్టిన వారి పై చర్యలుంటాయి.. సక్రమ పంపిణీ జరపడం జిల్లా యంత్రాంగం బాధ్యత.. పారదర్శకంగా విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజలకు మార్పు చూపించాలని మా ఆలోచన అన్నారు. అయితే, కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా మార్చారు.. 35404 మెట్రిక్ టన్నులు 159 కోట్ల విలువ కలిగిన సరుకు సీజ్ చేశాం.. కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్ల తనిఖీలో మాత్రమే 35404 మెట్రిక్ టన్నులు వచ్చింది.. ఒక కిలో బియ్యం 39 రూపాయలకు ఇస్తోంది… 1000 కోట్లను జిల్లాలకు చెల్లించిన విధానం.. పశ్చిమ గోదావరి కి 565.95 కోట్లు, తూర్పు గోదావరికి 121.96 కోట్లు, కోనసీమ కి 163.59 కోట్లు, కాకినాడ కు 21.92 కోట్లు, ఏలూరు కి 119 కోట్లు, బాపట్ల కు 6.65 కోట్లుగా ఉందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్‌.