Minister Nara Lokesh: పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ఇండియాస్పోరాకు లోకేష్ ఆహ్వానం
- అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్..
- ఇండియాస్పోరా.. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో భేటీ..
- ఏపీ స్టార్టప్.. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది..
- ఏఐ వర్సిటీ.. డాటా సెంటర్లు రాబోతున్నాయి..
- ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అని ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇండియాస్పోరా, యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం సందర్భంగా వెల్లడించారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయం అన్నారు.. యూఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారు కాబోతోంది. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణయించాం అన్నారు..
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్‌ని చంపేస్తామని బెదిరింపు.. నిందితుడి అరెస్ట్..
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఇక, అధునాతన సాంకేతిక పరిజ్హానంతో త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి అన్నారు మంత్రి లోకేష్.. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటుచేయబోతున్నాం. అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొన్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ రంగస్వామి, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కవితా మరియప్పన్ (జడ్ స్కేలర్), శివ శివరాం (సీఈవో, క్వాంటమ్ స్కోప్), రమాకాంట్ ఆలపాటి (సీఈవో, యూల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్), సోహిల్ చావ్లా (ఫౌండర్ & సీఈవో టి సెకండ్), అన్యా మాన్యుయల్ (ప్రిన్సిపాల్, రైస్ హాడ్లీ గేట్స్ & మాన్యుయల్ ఎల్ఎల్ సి), రియా షిమా (గ్లోబల్ బిజినెస్ హెడ్, జెట్ సింథసిస్), డీన్ గార్ ఫీల్డ్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, నెట్ ఫ్లిక్స్), మిచైల్ డిపాలా కోయ్లే (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ, ఐబిఎం), నిక్ క్లెగ్ ( ప్రెసిడెంట్, మెటా గ్లోబల్ ఎఫైర్స్), బెకీ ఫ్రాసర్ ( వైఎస్ ప్రెసిడెంట్, క్వాల్కమ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), చంతాల్ అలకంత్రా (ఎండి, లాంరీసెర్చ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), ప్రభురాజా (ప్రెసిడెంట్, సెమీకండక్టర్స్ పొడక్ట్ గ్రూప్, అప్లయ్డ్ మెటీరియల్స్), గ్రేస్ కోహ్ (వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ రిలేషన్స్, సియానా), తోబి యాంగ్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్), స్టాట్ ఆంటోని (పార్టనర్, కోవింగ్టన్ & బర్లింగ్), ఎమి హరియానీ (సీనియర్ అడ్వయిజర్, యుఎస్ఐబిసి) , ఇండియాస్పోరా ప్రతినిధులు ముద్దు సుధాకర్ (ఆసియారా), శ్రీ సతీష్ అంబటి (హెచ్20 ఎఐ), భాస్కర్ శ్రీనివాసన్ (యావియేషన్ టెక్నాలజీ లిమిటెడ్), శ్యామ్ బాలాజీ (డెలాయిట్), సంజయ్ ఖండవేరు (ఐవిక్యాప్ వెంచర్స్), కృష్ణ యార్లగడ్డ (ఫాల్కన్ ఎక్స్), ప్రభ భాష్యం (యాపిల్), ప్రియా రామచంద్రన్ (జోమ్ క్యాపిటల్), రాజీ భాస్కర్ (సూపర్ బ్లూమ్), రాజురెడ్డి (సియారా అట్లాంటిక్), రాకేష్ వైద్య నాథన్ (ధ జై గ్రూప్), రమణన్ షణ్ముగం (ఒవెన్యూ), రావి రవికుమార్ (కోటా క్యాపిటల్), సతీష కంచి (వన్ హబ్, పిఓఎస్), జియా రెహమాన్ (స్ప్రౌట్ ఎఐ), అనిల్ అద్వానీ (ఇన్వెంటస్ లా), నవ దావులూరి, శివచైతన్య (ఇంటరాక్ట్లీ ఎఐ), నవ్య దావులూరి (క్యూరీ ఎఐ), అంజి మారం (క్రిటికల్ రివర్), విశేష్ పువాడి (హెచ్ఎస్ బిసి), ప్రసాద్ ఆకెళ్ల (ఆప్టెస్సా), సంజయ్ వర్మ (అలిక్స్ పార్టనర్స్), మనోహర్ పాలూరి (మెటా), రాంభూపాల్ (డైకెమ్ తదితరలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!