NTV Telugu Site icon

Heavy Rains in AP: కృష్ణా నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ

Atchannaidu

Atchannaidu

Heavy Rains in AP: కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ.. వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఇక, మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్ లతో పశువులకు వైద్యం అందించేందుకు సిద్ధం అయ్యారు వైద్యులు.. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందించనున్నారు.. విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో బోట్లతో మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. 163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యల్లో ఉన్నారని తెలిపారు.

Read Also: Pune murder: పూణె మాజీ కార్పొరేటర్ మర్డర్ కేసులో విస్తుగొల్పే విషయాలు.. హత్య చేయించిదెవరంటే..!

ఇక, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయ శాఖ.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు ఏపీలో వరదలతో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.. మరోవ ముగ్గురు గల్లంతు కాగా.. 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లిందని.. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం.. 34 వేల ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు.. భారీ వర్షాలు, వరదలతో 1067.57 కిలో మీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయని అంటున్నారు అధికారులు.