మహారాష్ట్రలోని పూణెలో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొంత సోదరీమణులే ఈ హత్య చేయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూణె మాజీ కార్పొరేటర్ వనరాజ్ అందేకర్.. పూణెలోని నానా పేత్ ప్రాంతంలో ఒకచోట నిలబడి స్నేహితుడితో ముచ్చటిస్తున్నాడు. ఇంతలో 10-15 మంది ఉన్న గ్రూప్ బైకులపై వచ్చి అమాంతంగా మారణాయుధాలు, తుపాకులతో దాడులకు తెగబడ్డారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటాడి మరీ దాడులకు పాల్పడ్డారు. దీంతో మాజీ కార్పొరేటర్ వనరాజ్ అందకేర్ తీవ్రగాయాలు పాలయ్యాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు.
ఇది కూడా చదవండి: Rajasthan: నీట మునిగిన స్మశానవాటిక.. నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలు..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. అయితే ఈ హత్య వెనుక అతని ఇద్దరు సోదరీమణులు, అన్నదమ్ములు ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అలాగే హత్యలో పాల్గొన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వనరాజ్ అందేకర్ తండ్రి బందు అందేకర్ ఫిర్యాదు మేరకు బాధితుడు సోదరీమణులు సంజీవని, కల్యాణి, అన్నదమ్ములు జయంత్ గణేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వనరాజ్ కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ఓ దుకాణం విషయంలో తగాదా ఉంది. ఈ విషయంపై హత్యకు ముందు కొన్ని గంటల ముందు కూడా తోబుట్టువుల మధ్య ఘర్షణ జరిగింది. ఉదయం పెద్ద రభసే జరిగింది.. దీన్ని మనసులో పెట్టుకుని రాత్రికి మర్డర్ ప్లాన్ చేసి చంపేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు.. ఎకరాకు రూ.10 వేలు పరిహారం
నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ రంజన్ కుమార్ శర్మ తెలిపారు. మొత్తం ఎఫ్‌ఐఆర్‌లో 10 మంది పేర్లు ఉన్నాయని.. గుర్తుతెలియని ఐదుగురు పేర్లు ఉన్నాయని చెప్పారు. పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయని పేర్కొన్నారు. ఆస్తి వివాదంతోనే ఈ హత్య జరిగినట్లుగా వెల్లడించారు. విచారణలో వాస్తవాలు తెలుస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయమే తమకు ఫిర్యాదు అందిందని.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా సమాచారం వచ్చిందని తెలిపారు. ఇది కుటుంబ సమస్య కాబట్టి.. కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించినట్లు చెప్పారు. అనంతరం రాత్రి ఈ హత్య జరిగినట్లుగా వెల్లడించారు. హత్య వెనుక ఆస్తి వివాదమే అయి ఉండొచ్చని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక ఉదయం గొడవ జరిగినప్పుడే ఒక సోదరి చంపేయండి అంటూ గట్టి గట్టిగా అరిచినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆరు ద్విచక్ర వాహనాల్లో మొత్తం 12 మంది వరకు వచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వనరాజ్ అందేకర్‌పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా గుర్తించారు. పొడవాటి బ్లేడ్ కొడవళ్లతో కూడా దాడి చేశారని పోలీసులు చెప్పారు. బాధితుడిని కేఈఎం ఆసుపత్రికి తీసుకువచ్చారని.. తీవ్రగాయాలు కావడంతో చనిపోయాడని జాయింట్ పోలీసు కమిషనర్ శర్మ తెలిపారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ కేసును పూణె క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందన్నారు. బాధితుడు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ క్యాంపులో సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం.
Visuals of former NCP Corporator Vanraj Andekar attacked in cinematic style by a gang of 10-15 while he was standing casually.
Alarmingly, at least five members of the gang were armed with guns.#Pune #NCP #BreakingNews #CrimeAlert #VanrajAndekar#Maharashtra #India pic.twitter.com/bOOFOFaqvQ
— Mr. Shaz (@Wh_So_Serious) September 2, 2024