Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై అసలు కారణం అదే.. మంత్రి ఆనం వివరణ..
- కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై మంత్రి ఆనం వివరణ..
- ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు..
- ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం అని స్పష్టం..
- హరిముకుంద్‌పండా అనే వ్యక్తి 12 ఎకరాల భూమిలో..
- తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం అది..
- ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది తరలిరావడంతో ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasibugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు అసలు కారణాలు.. ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు.. ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం అని స్పష్టం చేశారు.. శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదన్న మంత్రి… ఈ ప్రైవేట్ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు.. హరిముకుంద్‌పండా అనే ఒక వ్యక్తి తనకు చెందిన 12 ఎకరాల సొంత భూమిలో.. తన సొంత నిధులతో నిర్మించిన ఒక ప్రైవేటు దేవాలయం అది అన్నారు.. ఇక, ఈ దేవాలయ సామర్థ్యం 2,000 నుంచి 3,000 మంది వరకు మాత్రమే ఉండగా.. ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా 25,000 మంది వరకు ప్రజలు వచ్చారు.. కానీ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేకపోయారని వివరించారు.. మరోవైపు, ప్రభుత్వానికి కూడా సదరు వ్యక్తి సమాచారం ఇవ్వలేదు.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం.. అందుకు తగిన ఏర్పాట్లు లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు.. జరిగిన దుర్ఘటనకు ఇదే కారణం. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..
Also Read
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
తాజావార్తలు
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!