NTV Telugu Site icon

Minister Anagani Satya Prasad: ఈ నెల 6 నుండి రెవెన్యూ సదస్సులు.. కలెక్టర్లకు కీలక సూచనలు

Minister Anagani Satya Pras

Minister Anagani Satya Pras

Minister Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.. అయితే, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ నెల 6వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కలెక్టర్లకు కీలక సూచనలు ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని స్పష్టం చేశారు.. భూ వివాదాలకు ముగింపు పలికే విధంగా రెవెన్యూ సదస్సులు జరగాలని ఆదేశాలు జారీ చేశారు.. రెవెన్యూ సదస్సులను మొక్కుబడి కార్యక్రమంలా మార్చవద్దంటూ.. అధికారులకు హెచ్చరించారు.. రెవెన్యూ సదస్సులో భూ దురాక్రమణులు, 22a భూముల ఉల్లంఘన పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.

Read Also: Varun Dhawan : కీర్తి సురేష్‌కు బాలీవుడ్ లో వేరే లెవల్ ఎంట్రీ

రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, పేదలకు భవిష్యత్తు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని తెలిపారు అనగాని.. గత ప్రభుత్వంలో క్షేత్రస్ధాయిలో భూ సమస్యలు సృష్టించారు.. ఆర్ధికంగా దోచుకునే పథకాలే తప్ప పేదవాడికి ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు.. 67 వేల గ్రీవెన్స్‌లు రెవెన్యూలోనే వచ్చాయి… గ్రీవెన్సులు అన్నీ అక్కడి సమస్యలు అక్కడికక్కేడే పరిష్కరించేలా రెవెన్యూ సదస్సు నిర్వహించాలన్నారు.. 2018 తరువాత మరల రెవెన్యూ సదస్సులు పెట్టలేదు.. ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 17,500 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.. 22a కింద పెట్టిన వాటికి కూడా న్యాయం చేసేలా ఈ సదస్సుల్లో పరిష్కరిస్తాం అని స్పష్టం చేశారు.. అన్యాక్రాంతం అయిన వాటిని కూడా అసలు యజమానిని డిస్ప్లే చేసి రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తాం.. రెవెన్యూనే కాకుండా హౌసింగ్ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.. గత ప్రభుత్వం వారి కార్యకర్తలకే భూములిచ్చింది.. అర్హులై స్ధలాలు లేని వారికి భూములు, నూతన రేషన్ కార్డులు ఇచ్చేలా ఒకేదగ్గర పరిష్కరిస్తాం అన్నారు. లీజుకు తీసుకున్న వాటి వినియోగంపై ఒక నిర్ణయం రెవెన్యూ సదస్సులలో తీసుకుంటాం అన్నారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.

Show comments