NTV Telugu Site icon

Minister Anagani Satya Prasad: జగన్‌కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందే.. మంత్రి సెటైర్లు..

Anagani

Anagani

Minister Anagani Satya Prasad: విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కాకరేపుతోంది.. గురువారం రోజు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరణ ఇచ్చారు.. తమ హయాంలో జరిగిన ఒప్పందాలను వివరిస్తూ.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలతో.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే తక్కువ ధరకే కొనుగోలు చేశామని.. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిన తనకు సత్కారం చేయాలి.. కానీ, విమర్శలా? అని ప్రశ్నించారు.. అయితే, వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. వైఎస్‌ జగన్ కు నిజంగా బిరుదులు, అవార్డులు ఇవ్వాల్సిందేనన్న ఆయన.. ప్రపంచ స్థాయిలో అవినీతి చేసినందుకు ‘ఇంటర్నేషనల్ క్రిమినల్’ అవార్డు ఇవ్వొచ్చు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు..

Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు జాగ్రత్త.. హిందువులపై దాడుల మధ్య బంగ్లాదేశ్‌కి హెచ్చరిక..

ఇక, పదే పదే అబద్దాలు చెబుతూ చెయ్యని, చేయలేని గొప్పులు చెప్పుకునే జగన్ రెడ్డికి ‘పిట్టల దొర’ టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందని ఎద్దేవా చేశారు అనగాని సత్యప్రసాద్.. చెల్లెళ్లను రొడ్డు మీదకు ఈడ్చి వారి పరువును నిలువునా తీసినందుకు ‘ఆంధ్ర భ్రష్టరత్న’ అవార్డు ఇవ్వొచ్చు.. తన ఐదేళ్ల పాలనలో హత్యలు, దాడులతో హడలెత్తించినందుకు ‘నరరూప రాక్షసుడు’ బిరుదు సరిగ్గా సరిపోతుంది.. అమరావతి పై హామీని తుంగలో తొక్కినందుకు, హామీలు ఇచ్చి ప్రజలను మోసిగించినందుకు ‘నమ్మక ద్రోహి’ అనే అవార్డు కచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ.. వైఎస్‌ జగన్‌పై సెటైర్లు వేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.

Show comments