Site icon NTV Telugu

Minister Anagani Satya Prasad: జగన్‌ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి..!

Anagani Satya Prasad

Anagani Satya Prasad

Minister Anagani Satya Prasad: ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. సరిగ్గా ఏడాది క్రితం రాష్ర్టంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డ్ పడిందన్న ఆయన.. ప్రజలను వేధించి వేయించుకు తిన్న సైకో నేతకు చాచి కొట్టినట్లు ప్రజలు బుద్ది చెప్పారని పేర్కొన్నారు.. ఐదేళ్ల పాటు ప్రజలకు చేసిన మోసానికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.. కానీ, వెన్నుపోటు దినం అంటూ వెర్రి కూతలు కూస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు.. ప్రజలు చారిత్రక తీర్పునిచ్చన జూన్ 4వ తేదీని వైసీపీ నేతలు పశ్చాతాప దినంగా జరుపుకోవాలని సూచించిన ఆయన.. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు జరుగుతున్న మేళ్లను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు.. అందుకే అలవాటు ప్రకారం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కానీ, తల్లికి, చెల్లెల్లలకే వెన్నుపోటు పొడిచిన జగన్‌ను ప్రజలు నమ్మడం లేదన్నారు.. ఇదే వైఖరితో కొనసాగితే వైసీపీ పరిస్థితి గుండుసున్నాకు చేరుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్..

Read Also: Operation Sindoor: భారత్ చెప్పింది తక్కువే.. “సిందూర్‌”లో పాకిస్తాన్‌కి తీవ్ర నష్టం..

Exit mobile version