Mega PTM in AP: ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు… సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు.. 3 లక్షలకు పైగా టీచర్లు.. కోటి 50 లక్షల మంది తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ గిన్నిస్ రికార్డ్ దిశగా జరగనుంది.. పాజిటివ్ పేరెంటింగ్.. స్కూళ్లలో మౌళిక సదుపాయాలు.. విద్యార్థుల ప్రోగ్రెస్ పై ప్రధానంగా చర్చ జరగనుంది..
Read Also: Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ భేటీ.. సర్పంచ్ ఎన్నికలపై క్లారిటీ వచ్చే ఛాన్స్!
ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది.. స్కూలు అంటే కేవలం తరగతి గదిలో కూర్చో బెట్టి పాఠాలు చెప్పడం కాదని.. పిల్లల్లో నైతికత పెంచడం… ఉపాధ్యాయులు.. తల్లిదండ్రుల పాత్ర సూచించడం ప్రధాన ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం జరగనుంది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ… ప్రైవేట్ స్కూళ్లలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించే కార్యక్రమంగా నిర్వహించనుంది ప్రభుత్వం.
Read Also: Samsung Galaxy Z Flip 7 FE: పవర్ ఫుల్ ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో.. సామ్ సంగ్ Galaxy Z Flip 7 FE విడుదల..
విద్యార్థి ప్రగతి.. స్కూల్ వాతావరణం.. ఫుడ్ ఏ రకంగా ఉంది అనే అంశంపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకుంటారు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతికి సంబంధించి వివరించి ప్రోగ్రెస్ కార్డులను అందిస్తారు.. సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేష్ ఇవాళ సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామంలో పాఠశాలలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థులతో ఒక మొక్క నాటిస్తారు.. పర్యావరణ పెంపు.. ఆహ్లాద కర వాతావరణం… మంచి పరిసరాలు. వీటిపై అవగాహన కల్పిస్తారు.. గుడ్ టచ్ బాడ్ టచ్. ఈ రెండిటి తేడా వివరిస్తారు.. డ్రగ్ ఎడిక్షన్.. చిన్న వయసులోనే మత్తు పదార్ధాల అలవాటు వీటికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తారు.. పాజిటివ్ పేరెంటింగ్ పై నిపుణులు వివరిస్తారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది….