NTV Telugu Site icon

Kuppam: వైసీపీకి బిగ్‌ షాక్‌.. టీడీపీ గూటికి కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌

Kuppam

Kuppam

Kuppam: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకంటే ముందు నుంచే రాజకీయ సమీకరణలు మారిపోయాయి.. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. ఇప్పటికే కొందరు సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నేతలు… ఇలా చాలా మంది పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరారు.. మరికొందరు జనసేన కండువా కప్పుకున్నారు.. ఇంకా కొందరు కమలం పార్టీలో చేరిపోయారు.. ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన కీల‌క నేత, కుప్పం మున్సిప‌ల్ ఛైర్మన్‌ డాక్టర్ సుధీర్.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీకి గుడ్‌బై చెప్పడంతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిల‌ర్ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన‌ట్లు ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్‌..

Read Also: Kidney Cancer Signs: ఈ లక్షణాలు ఉంటే కిడ్నీ క్యాన్సర్‌ కావచ్చు

ఉండవల్లి నివాసంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి సుధీర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి సుధీర్ ను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని ఈ సందర్భంగా వెల్లడించారు సుధీర్. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్‌ చేసినట్టుగా కేంద్రీకరించారు వైఎస్‌ జగన్‌.. అయితే, మరోసారి భారీ విజయాన్ని అందుకున్న చంద్రబాబు నాయుడు.. తన నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు..

Show comments