Site icon NTV Telugu

Kinjarapu Atchannaidu: బాధ్యతలు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఆరు ఫైళ్లపై సంతకాలు..

Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు.. ఇక, ఛాంబర్లలో మార్పులు, చేర్పులతో.. కొందరు మంత్రుల బాధ్యతల స్వీకరణ ఆలస్యం అయ్యింది.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు తన ఛాంబర్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. ఇప్పటి వరకు సచివాలయంలోని తన ఛాంబర్ సిద్ధం కాకపోవడంతో ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా అచ్చెన్నను టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందలు తెలిపారు.. మరోవైపు.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు మంత్రి అచ్చెన్నాయుడు.. పొలం పిలుస్తుంది కార్యక్రమంపై తొలి సంతకం చేసిన ఆయన.. వ్యవసాయ యాంత్రీకరణపై రెండో సంతకం.. 217 జీవో రద్దు చేస్తూ మరో సంతకం.. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ నిధుల విడుదలపై ఇంకో సంతకం.. పశువుల డీవార్మింగ్, యానిమల్ సెన్సెస్‌పై ఇలా ఆరు సంతకాలు చేశారు..

Read Also: Stock market: మరోసారి రికార్డులు సృష్టించిన సూచీలు

ఇక, ఈ సందర్భంగా మంత్రి అచెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా వ్యవసాయ శాఖకు తాళం వేశారు.. కానీ, కూటమి ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఉండదు.. రైతు ఆత్మగౌరవంతో బతికేలా పనిచేస్తాం అన్నారు. కౌలు రైతులను ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు.. ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.. ప్రతి మంగళవారం, బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని వివరించారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

Exit mobile version