Site icon NTV Telugu

Pastor Praveen Pagadala: ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ కోసం పిల్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Pastor Praveen Pagadala

Pastor Praveen Pagadala

Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్‌ పగడాల మృతిపై వివాదం కొనసాగుతూనే ఉంది.. అది రోడ్డు ప్రమాదమేనంటూ కొన్ని సీసీ టీవీ ఫుటేజ్‌లతో సహా పోలీసులు చెబుతుంటూ.. కాదు.. కాదు.. అది ముమ్మాటికి హత్యే అంటున్నారు కొందరు నేతలు.. క్రిస్టియన్‌ సంఘాలు.. ఇక, ఈ వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. అంతే కాదు.. ప్రవీణ్‌ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.. ఆ పిల్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం.. అయితే, ప్రవీణ్ ను హత్య చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ కేఏ పాల్.. మరోవైపు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది హైకోర్టు..

Read Also: Gold Rates: లక్షకు చేరువలో తులం బంగారం.. ఒక్కరోజే వెయ్యి పెరుగుదల

ఇక, హైకోర్టులో కీలక వాదనలు వినిపించారు కేఏ పాల్.. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాలని పక్కా ప్రణాళికతో హత్య చేశారని పేర్కొన్నారు.. పోలీసులు మార్ఫింగ్ వీడియోలు విడుదల చేశారని ఆరోపించారు.. మరోవైపు, స్థానిక ఎస్పీ అందరిని మాట్లాడవద్దని భయపెట్టారు.. అసలు ప్రవీణ్ పగడాలకు మద్యం సేవించే అలవాలే లేదన్నారు పాల్.. ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు.. 48 గంటల్లో వచ్చే రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేఏ పాల్.. కాగా, ప్రవీణ్‌ పగడాల మృతిపై పోలీసులు వివరణ ఇచ్చి.. అది రోడ్డు ప్రమాదంగా తేల్చిన తర్వాత.. కేఏ పాల్‌.. సీబీఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది..

Exit mobile version