Site icon NTV Telugu

Janasena MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు..

Shiva Shankar

Shiva Shankar

Janasena MLA Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై పార్టీ అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తోంది అన్నారు త్రీ మెన్‌ కమిటీ సభ్యుడు శివశంకర్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో పాటు రైల్వే కోడూరులో 50 మందికి పైగా వ్యక్తులను ఇప్పటికే విచారించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. బాధితురాలు వీణను కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినప్పటికీ ఆమె హాజరు కాలేదని.. అయితే, షీల్డ్ కవర్‌లో పూర్తి వివరాలు పంపించిందని అన్నారు. ఆ నివేదికను కమిటీ పరిశీలనలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Read Also: BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..

ఇది జనసేన పార్టీకి సంబంధించిన అంశం కాదని.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు వీణ మధ్య ప్రైవేట్ వ్యవహారమని అన్నారు శివశంకర్‌. ఈ విషయాన్ని పార్టీకి రుద్దే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. రైల్వే కోడూరు పర్యటనలో అనేక కొత్త పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పారు తప్ప… కమిటీ నివేదికను వారం రోజుల్లో ఇవ్వాలని ఎవరూ చెప్పలేదని అన్నారు.. ఇది అత్యంత సున్నితమైన విషయం కాబట్టి లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది అని ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక వైసీపీ హస్తం ఉందేమో అనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని తెలిపారు. వైసీపీది కన్స్ట్రక్టివ్ మైండ్ కాదు అని డిస్ట్రక్టివ్ మైండ్ అన్ని మండిపడ్డారు.. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. ఇది జనసేన పార్టీ అంతర్గత కమిటీ విచారణ అని.. కమిటీ ఎలా పనిచేయాలి, ఎప్పుడు నివేదిక ఇవ్వాలి అన్నది వైసీపీకి సంబంధం లేని విషయమని స్పష్టం చేశారు. విచారణ వేగంగా కొనసాగుతోందని.. ఇంకా పలు కోణాల్లో దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు.. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సమర్పిస్తామని తెలిపారు శివశంకర్..

Exit mobile version