IAS Officers Meet CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన ఆ నలుగురు ఐఏఎస్‌లు..
- సీఎం చంద్రబాబుతో నలుగురు ఐఏఎస్ ల భేటీ..
- తెలంగాణ నుంచి వచ్చి నిన్నే ఏపీలో రిపోర్ట్ చేసిన ఐఏఎస్ లు..
- సీఎంను కలిసిన రోనాల్డ్ రోస్.. ఆమ్రపాలి.. వాకాటి అరుణ.. వాణి ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Officers Meet CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.. వారితో మాట్లాడిన సీఎం.. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.. ఈ రోజు టీడీఎల్పీ సమావేశం జరుగుతోన్న విషయం విదితమే.. కాగా, తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు.. ఏపీకి వెళ్లాలన్న ఆదేశాల నేపథ్యంలో.. ఎట్టకేలకు గురువారం రోజు ఏపీలో రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. నిన్న ఉదయం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబును కలిశారు.
Read Also: Delhi Air Quality: దీపావళికి ముందే ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..
Also Read
అయితే, తెలంగాణలోనే కొనసాగేందుకుగాను డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలపై వీరు క్యాట్‌ను.. తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, ఎక్కడా వారికి ఊరట లభించలేదు.. దీంతో.. ఐదుగురు ఐఏఎస్‌లు నిన్న ఏపీలో రిపోర్ట్ చేశారు. వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి ఉదయమే రిపోర్ట్ చేయగా.. ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న మరో ఐఏఎస్ ఎం.ప్రశాంతి.. బుధవారం సాయంత్రమే రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. ఇక, త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు పోస్టింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!