తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన పలువురు ఐఏఎస్ (IAS)లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అందులో.. టూరిజం ఎండీగా ఆమ్రపాలి, వైద్యారోగ్య శాఖ కమిషనరుగా వాకాటి కరుణ, జీఏడీ ముఖ్య కార్యదర్శి (GPM & PR)గా వాణి మోహన్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్ అధికారులు.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.
IAS officers: డీఓపీటీ ఆదేశాల మేరకు ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులు రిపోర్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్ రిపోర్టు చేసేశారు.
తెలంగాణలో ప్రభుత్వంలో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మార్పుల ప్రకారం, పలువురు సీనియర్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా, ప్రభుత్వం నుంచి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారుల స్థానాలు భర్తీ చేయడానికి ఇన్‌చార్జులను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఈ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో రిలీవైన IASల అధికారుల స్థానాల్లో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమ్రపాలి స్థానంలో GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, వాకాటి కరుణ స్థానంలో…
కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్ ను పలువరు ఐఏఎస్‌లు ఆశ్రయించారు. క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన అందులో ఉన్నారు.
అర్బన్ ప్లానింగ్ , రిసోర్స్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరచడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) తన అధికార పరిధిలోని అన్ని ప్రాపర్టీలు , యుటిలిటీలను మ్యాప్ చేయడానికి సమగ్ర ఇంటిగ్రేటెడ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సర్వేను నిర్వహిస్తోంది. ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. ఈ చొరవలో డ్రోన్‌లను ఉపయోగించి ఏరియల్ సర్వేలు , ప్రతి పార్శిల్‌కు సంబంధించిన సమాచారాన్ని క్యాప్చర్ చేయడానికి డోర్-టు-డోర్ మ్యాపింగ్, ఆన్-గ్రౌండ్ సర్వేయర్‌లు సేకరించిన జియోలొకేషన్…
నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని అతడు పిటిషన్ దాఖలు చేశాడు. ఇదే అంశంలో గతంలో కూడా ధోనీ కోర్టు మెట్లెక్కాడు. ఆమ్రపాలితో నడుస్తున్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ధోనీ తన పిటిషన్‌లో అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మే 6న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్…