NTV Telugu Site icon

IAS Officers Meet CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన ఆ నలుగురు ఐఏఎస్‌లు..

Iass

Iass

IAS Officers Meet CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు తెలంగాణ నుంచి వచ్చిన నలుగురు ఐఏఎస్‌ అధికారులు.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్.. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.. వారితో మాట్లాడిన సీఎం.. ఆ తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.. ఈ రోజు టీడీఎల్పీ సమావేశం జరుగుతోన్న విషయం విదితమే.. కాగా, తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు.. ఏపీకి వెళ్లాలన్న ఆదేశాల నేపథ్యంలో.. ఎట్టకేలకు గురువారం రోజు ఏపీలో రిపోర్ట్‌ చేసిన విషయం విదితమే.. నిన్న ఉదయం వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ను కలిసి జాయినింగ్‌ రిపోర్ట్‌ ఇచ్చారు ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబును కలిశారు.

Read Also: Delhi Air Quality: దీపావళికి ముందే ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..

అయితే, తెలంగాణలోనే కొనసాగేందుకుగాను డీవోపీటీ ఇచ్చిన ఆదేశాలపై వీరు క్యాట్‌ను.. తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, ఎక్కడా వారికి ఊరట లభించలేదు.. దీంతో.. ఐదుగురు ఐఏఎస్‌లు నిన్న ఏపీలో రిపోర్ట్‌ చేశారు. వాణీప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి ఉదయమే రిపోర్ట్ చేయగా.. ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న మరో ఐఏఎస్‌ ఎం.ప్రశాంతి.. బుధవారం సాయంత్రమే రిపోర్ట్‌ చేసిన విషయం విదితమే.. ఇక, త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఆ ఐదుగురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.