Site icon NTV Telugu

Home Minister Anitha: ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం..

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Home Minister Anitha: రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనల్లో బాలికల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారని హోంమంత్రి వెల్లడించారు.

మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తులో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని.. ఈ రెండు అంశాలపై ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరపాలని సీఎం ఆదేశించారన్నారు. మచ్చుమర్రి ఘటనలో మైనర్లు ఉన్నారని మంత్రి చెప్పారు. ఫోన్లలో అశ్లీల వెబ్ సైట్లు అందుబాటులోకి వస్తుండటమూ ఈ తరహా ఘటనలకు కారణం అవుతోందన్నారు. క్రిమినల్‌కు పార్టీ, క్యాస్ట్ ఉండదు.. వారికి శిక్ష పడాల్సిందేనని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: నామినేటెడ్ పోస్టులపై పవన్‌ కీలక వ్యాఖ్యలు.. నాగబాబుకు పదవి..!?

ముచ్చుమర్రి ఘటన
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పీఎస్‌ పరిధిలోని ఎల్లాల గ్రామానికి 8 ఏళ్ల బాలికపై మైనర్‌ బాలురు అత్యాచారం చేశారు. 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఇంట్లో చెబుతుందనే భయంతో హత్య చేసి.. మృతదేహాన్ని రిజర్వాయర్‌లో పడేశారు.

విజయనగరంలో దారుణ ఘటన
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నెలల చిన్నారిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారిపై తాత వరసైన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిన్నారిని తల్లి ఉయ్యాలలో పడుకోబెట్టి స్థానిక కిరాణా దుకాణానికి వెళ్లింది. కొద్దిసేపటికి నార్లవలస గ్రామానికి చెందిన బి.ఎరుకన్న దొర ఇంట్లోకి ప్రవేశించి చిన్నారి లైంగిక దాడి చేశాడు. చిన్నారి బిగ్గరగా ఏడవడంతో అక్కాచెల్లెళ్లు ఇంట్లోకి వచ్చారు. జరిగిన ఘటనను వారు తల్లికి చెప్పారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

Exit mobile version